గుండుపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో చోరీ

NLR: సీతారామపురం మండలం గుండుపల్లి అంగన్వాడీ కేంద్రం తాళాలు గుర్తు తెలియని వ్యక్తులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. వరుసగా మూడు రోజుల సెలవుల కారణంగా ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది. కేంద్రం నుంచి కోడి గుడ్లు దొంగలించినట్లు అంగన్వాడీ. టీచర్ ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సై జీ.శివకృష్ణారెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.