VIDEO: జాతీయ రహదారిపై ఆక్రమణలు తొలగింపు

VIDEO: జాతీయ రహదారిపై ఆక్రమణలు తొలగింపు

కృష్ణా: తాడిగడప పోరంకి వెళ్లే జాతీయ రహదారిపై ఆక్రమణలను మున్సిపల్ అధికారులు, పోలీసులు శుక్రవారం తొలగించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆక్రమించుకుని రోడ్డుపై వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులను తొలగించారు. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉండడంతో ఆక్రమణలను తొలగించామని అధికారులు తెలిపారు. ఈ తొలగింపుతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.