రాఘవ్ చద్దాపై వేటు.. నెటిజన్లు ఫైర్
MP రాఘవ్ చద్దాపై ఢిల్లీ AAP చీఫ్ సౌరభ్ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల కోసం పోరాడేందుకే చద్దాను పార్లమెంట్‌కు పంపామని, ఆయన అదే పని చేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రధానిని, కేంద్రాన్ని ప్రశ్నించలేదనే సాకుతో ఆయనపై వేటు వేయడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవ సమస్యలను పక్కన పెట్టమని పార్టీ చెబుతోందా? అని నిలదీస్తున్నారు.