బౌద్ధ స్థల ప్రదర్శనశాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సామేలు

సూర్యాపేట: నాగారం మండలం ఫణిగిరిలోని తెలంగాణ వారసత్వ శాఖ ఆధ్వర్యంలో బౌద్ధ స్థల కళాఖండాల ప్రదర్శనశాలను సోమవారం ఎమ్మెల్యే సామేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తిలకించి బౌద్ధ సంపద గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో పర్యాటకశాఖ కార్యదర్శి శైలజారామయ్యర్, కలెక్టర్ వెంకట్రావు పాల్గొన్నారు.