పేదల భూములను సర్వే చేయించాలి
NZB: పోతంగల్ శివారులో పేదలకు పంపిణీ చేసిన భూములను సర్వే చేయించాలని CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వెంకట్రాములు డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఈ భూములను పరిశీలించి మాట్లాడారు. 30 ఏళ్ల క్రితం పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిందన్నారు. భూ సర్వే చేయించి పట్టాదారులకు అప్పగించాలని , లేనియెడల మరో మారు భూ పోరాటం చేస్తామని హెచ్చరించారు.