VIDEO: బస్సులు రాక వెలవెలబోయిన బస్టాండ్
MNCL: ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో జన్నారం బస్టాండ్ బస్సులు రాక బోసిపోయింది. జన్నారం బస్టాండ్ నాలుగు జిల్లాలకు వెళ్లే ప్రధాన సరిహద్దులో ఉండి జంక్షన్‌గా గుర్తింపు పొందింది. వివిధ డిపోలకు చెందిన బస్సులు జన్నారం మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికుల సమ్మె ప్రారంభం కావడంతో బుధవారం ఉదయం బస్టాండ్‌కు ఒక్క బస్సు కూడా రాలేదు.