కోహ్లీ ‘సెంచరీ’ల హాఫ్ సెంచరీకి రెండేళ్లు

కోహ్లీ ‘సెంచరీ’ల హాఫ్ సెంచరీకి రెండేళ్లు

విరాట్ కోహ్లీ వన్డే క్రికెట్‌లో 50వ సెంచరీ బాది నేటికి రెండేళ్లు. 2023 వరల్డ్ కప్‌లో ఇదే రోజున వాంఖడేలో న్యూజిలాండ్‌పై కోహ్లీ శతకం(117) బాది.. సచిన్(49) సెంచరీల రికార్డు బ్రేక్ చేశాడు. ఈ సందర్భంగా సచిన్‌కి కోహ్లీ అభివందనం చేసిన దృశ్యాలను ఫ్యాన్స్ ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ క్రమంలో కోహ్లీని అభినందిస్తూ ICC, BCCI అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.