కర్నూలుకు దూరంగా పందులను పెంచాలి: కమిషనర్

KRNL: రాష్ట్ర ఉన్నత న్యాయస్థాన ఉత్తర్వులు, రాష్ట్ర ప్రభుత్వ జీవో సంఖ్య 323 ప్రకారం పందులను నగర పరిధిలో పోషించేందుకు వీల్లేదని, వాటిని నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో పోషించాలని, కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ రవీంద్ర బాబు యజమానులకు స్పష్టం చేశారు. పందుల పెంపకపుదారులతో స్థానిక కేఎంసీ సమావేశ మందిరంలో సమావేశాన్ని నిర్వహించారు.