అడ్రస్ ప్రూఫ్ లేకుండానే గ్యాస్ సిలిండర్!

అడ్రస్ ప్రూఫ్ లేకుండానే గ్యాస్ సిలిండర్!

ఇకపై 5 కిలోల LPG సిలిండర్‌ను అడ్రస్ ప్రూఫ్ లేకుండానే, కేవలం ప్రభుత్వ గుర్తింపు కార్డుతో కొనుగోలు చేయవచ్చని కేంద్రం ప్రకటించింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత లేదని ప్రభుత్వం భరోసా ఇచ్చింది. వలస కార్మికుల సౌకర్యార్థం ఈ నిబంధనలను సరళతరం చేశామని, అక్రమ నిల్వలు నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.