పేకాట శిబిరంపై పోలీసులు దాడి
ELR: నూజివీడు మండల పరిధిలోని ముక్కొల్లుపాడు గ్రామపంచాయతీ శివారులోని పామాయిల్ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై గురువారం దాడి చేసినట్లు రూరల్ ఎస్సై జ్యోతి బసు తెలిపారు. ఈ దాడులలో 9 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుండి 18,430 రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు.