ఎస్పీ కార్యాలయంలో వాల్మీకి జయంతి వేడుకలు
PPM: మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా అయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ ఎస్ . వి.మాధవ రెడ్డి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతిలో అపూర్వ స్థానం పొందిందని తెలిపారు. ఆయన బోధనలు, సత్యం, ధర్మం, న్యాయం మానవత విలువలను మనకు నేర్పాయని పేర్కొన్నారు.