జర్మనీలో పురుషులకు కొత్త సైనిక నిబంధనలు!
జర్మనీ కొత్త సైనిక సంస్కరణల ప్రకారం, 17-45 ఏళ్ల పురుషులు మూడు నెలల కంటే ఎక్కువ కాలం విదేశాలకు వెళ్లాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. విద్య, ఉద్యోగం లేదా ఇతర ప్రయాణాలు ఏవైనా ఈ నిబంధన వర్తిస్తుంది. నిర్బంధ సైనిక శిక్షణ చట్టంలో భాగంగా ఈ మార్పులు జనవరి నుంచి అమల్లోకి వచ్చాయి. దేశ రక్షణ కోసం యువత అందుబాటులో ఉండాలనేది దీని ప్రధాన ఉద్దేశం.