VIDEO: SSC పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: MEO
MDK: తూప్రాన్ మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్షలకు ఏర్పాటు పూర్తి చేసినట్లు మండల విద్యాధికారి డాక్టర్ సత్యనారాయణ పేర్కొన్నారు. ఐదు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 1026 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు వివరించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు జరిగినట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఎంఈవో సూచించారు.