కిశోర బాలికలకు అవగాహన సదస్సు

కిశోర బాలికలకు అవగాహన సదస్సు

కృష్ణా: ఉంగుటూరు మండలం వెల్దిపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం కిశోర బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్‌ఎల్‌హెచ్‌పీ జీ.సునీత మాట్లాడుతూ.. బాలికలు వ్యక్తిగత పరిశుభ్రత, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోషకాహారంలో ఆకుకూరలు, చిరుధాన్యాలు తీసుకోవాలని, యోగా, వ్యాయామం, ఆటలతో ఆరోగ్యవంతమైన జీవితం గడపవచ్చని అన్నారు.