ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి

ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలి

మన్యం: క్షేత్రస్థాయిలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు ఆదేశించారు. కె.ఆర్.బి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించి ఆశాడే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసుపత్రిలో మరియు క్షేత్ర స్థాయిలో వైద్య సేవలపై ఆరా తీసి రికార్డులు పరిశీలించారు.