వాసవి మాత ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం
MDCL: అల్వాల్‌లోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు, షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి పంపిణీలో భక్తులు పాల్గొన్నారు. వేద పండితులు సనాతన సారథి నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో ఆలకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొని ఉగాది శుభాకాంక్షలు తెలుపుకున్నారు.