మెగా జాబ్ మేళాలో 214 మందికి ఉద్యోగాలు
ఖమ్మం SRBGNR ప్రభుత్వ కళాశాలలో మంగళవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. మొత్తం 423 మంది నిరుద్యోగులు నమోదు చేసుకోగా వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహించిన ఇంటర్వ్యూల అనంతరం 214 మంది అభ్యర్థులు ఎంపికయ్యారని ప్రిన్సిపల్ జాకిరుల్లా తెలిపారు. ఎంపికైన వారికి వెంటనే నియామక పత్రాలను అందజేశారు.