ఆటో ఢీకొని ఇద్దరు మృతి
బాపట్ల: వాడరేవు-పిడుగురాళ్ల హైవేపై ప్రమాదం ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటో ఢీకొని ఇద్దరు మృతి చెందారు. మృతులు పెద్దలక్ష్మయ్య (68), సుబ్బారావు (60)గా గుర్తింపు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను స్థానిక మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.