కదిరిలో ముగిసిన ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు
సత్యసాయి: కదిరిలో వెలసిన శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. 15 రోజులపాటు జరిగిన ఈ వేడుకల్లో భాగంగా చివరి రోజు శుక్రవారం స్వామివారికి శాస్త్రోక్తంగా పుష్పయాగోత్సవం నిర్వహించారు. నవ నరసింహ క్షేత్రాల్లో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో భక్త ప్రహ్లాద సమేత స్వయంభూ మూర్తిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.