సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

BDK: చండ్రుగొండ మండలం ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో ప్రతి నిరుపేదకు అండగా ఉండడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.