'పుంగనూరులో సొంత భవనాన్ని మంజూరు చేయండి’

'పుంగనూరులో సొంత భవనాన్ని మంజూరు చేయండి’

CTR: పుంగనూరులో సింగిల్ విండోకి సొంత భవనాన్ని మంజూరు చేయాలని సింగిల్ విండో అధ్యక్షుడు పగడాల రమణ కోరారు. ఇందులో భాగంగా బుధవారం చిత్తూరులో నూతనంగా నియామకమైన సింగిల్ విండో అధ్యక్షులతో నిర్వహించిన సమావేశానికి డీసీసీబీ బ్యాంకు ఛైర్మన్ అమస రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ఈ మేరకు పుంగనూరులో సొంత భవనం మంజూరు చేయాలని ఛైర్మన్‌ని కోరారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు పగడాల తెలిపారు.