కారుణ్య నియామక ఉత్తర్వులు అందజేసిన కలెక్టర్

గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి మంగళవారం కలెక్టరేట్‌లో కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి ఉత్తర్వులు అందజేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఈ ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి కుటుంబానికి కారుణ్య నియామకం ద్వారా భరోసా కల్పిస్తామని తెలిపారు.