'పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యం'

'పేదల సంక్షేమమే టీడీపీ లక్ష్యం'

KKD: జిల్లాలోని గొల్లప్రోలు పట్టణంలోని ఆదివారం టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్, మాదేపల్లి రంగబాబు విగ్రహాలకు నివాళ్లు అర్పించారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. ఆ ఆశయ సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.