నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
జగిత్యాలలోని టౌన్-3 సెక్షన్ పరిధిలో సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని డీఈ కే. గంగారాం తెలిపారు. 11కేవీ ఫీడర్‌లో కొత్త పోల్స్ ఏర్పాటు పనుల కారణంగా అంతరాయం ఏర్పడుతుందన్నారు. ఎస్పీ ఆఫీస్, హౌసింగ్ బోర్డ్, రామాలయం, అంతర్గామ్ రోడ్, ధరూర్ క్యాంప్, మెడికల్ కాలేజీ ప్రాంతాల్లో విద్యుత్ ఉండదని, వినియోగదారులు సహకరించాలన్నారు.