అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ

SDPT: తొగుట మండల కేంద్రంలో పనుల జాతర కార్యక్రమంలో అంగన్వాడీ కేంద్ర భవన నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రూ. 12 లక్షలతో ఒక్కొక్క భవనంగా ఉపాధి హామీ పథకంలో నాలుగు భవనాలకు రూ. 48 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు వివరించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి, ఆత్మ కమిటీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, అక్కం స్వామి, గంట రవీందర్ పాల్గొన్నారు.