పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

SRPT: రాజకీయ, ఆర్థిక, సాంఘిక సమానత్వం కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నను సమాజంలో ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. కోదాడ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.. సర్దార్ సర్వాయి పాపన్న అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు.