బొబ్బిలిలో దాడితల్లి ఉత్సవాలకు సన్నాహాలు

బొబ్బిలిలో దాడితల్లి ఉత్సవాలకు సన్నాహాలు

VZM: బొబ్బిలి ప్రాంతంలో ఆరాధ్యదేవతగా పూజలందుకుంటున్న దాడితల్లి ఉత్సవాలను ఏప్రిల్ 27 నుంచి మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించేందుకు గ్రామ పెద్దలు నిర్ణయించారు. 28న సిరిమానోత్సవం, 29న అనుపోత్సవం నిర్వహించనున్నారు. సోమవారం అమ్మవారిని మేళతాళాలతో గ్రామంలోకి ఆహ్వానించనున్నారు. ఉత్సవాల ముగింపు వరకు గ్రామంలో ఘటాలను ఊరేగించనున్నారు. పాతబొబ్బిలి సరేపోలమ్మ ఉత్సవాల తేదీలు ఇంకా ఖరారు కాలేదు.