బస్సు ప్రమాద ఘటనపై కారుమూరి తీవ్ర దిగ్భ్రాంతి
KRNL: బస్సు ప్రమాదం ఘటనపై మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం తణుకు వైసీపీ కార్యాలయంలో శ్రేణులతో కలిసి కొద్దిసేపు మౌనం పాటించి ప్రమాద మృతులకు సంతాపం తెలియజేశారు. ఈ ప్రమాదంలో 20 మంది సజీవ దహనం కావడం కలచి వేసిందని చెప్పారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.