హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన

హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన

హర్మూజ్ జలసంధిని దాటడానికి ఒక్కో నౌకకు రూ.18 కోట్ల వరకు ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై భారత్‌లోని ఇరాన్ దౌత్య కార్యాలయం స్పందించింది. సోషల్ మీడియాలో, వార్తా సంస్థల్లో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఇరాన్ ఎంబసీ స్పష్టం చేసింది. ఈ మేరకు X వేదికగా ఒక పోస్ట్ చేస్తూ.. అదంతా తప్పుడు ప్రచారమని కొట్టిపారేసింది.