ఫెన్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాలు

ఫెన్సింగ్ క్రీడల్లో కాంస్య పతకాలు

GNTR: ఫెన్సింగ్ క్రీడల్లో రాష్ట్ర స్థాయిలో కాంస్య పతకం సాధించి పొన్నూరు కీర్తి ప్రతిష్టలను నిలిపిన విద్యార్థులను మండల విద్యాశాఖ అధికారి డి.రాజు అభినందించారు. శనివారం పొన్నూరు మండల విద్యాశాఖ కార్యాలయంలో పతకాలు సాధించిన విద్యార్థులు ఎంఈవో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.