ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

MBNR: మూసాపేట్ మండలం కొమ్మిరెడ్డి పల్లిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ధాన్యాన్ని దళారులకు అమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలోనే అమ్మాలని సూచించారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.