'ఖమ్మం' జిల్లాగా ఎప్పుడు ఏర్పడిందంటే..?
KMM: రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఖమ్మం జిల్లా 1953 OCT 1న ఏర్పడింది. ఉమ్మడి రాష్ట్రంలో వరంగల్ జిల్లా నుంచి విడిపోయి ఖమ్మం, మధిర, ఏల్లందు, బూర్గంపాడు, పాల్వంచ తాలూకాలతో నూతన జిల్లాగా రూపుదిద్దుకుంది. స్తంభాద్రి కొండల మధ్య ఉండటంతో ‘ఖమ్మం’ అనే పేరు వచ్చింది. 2016లో కొత్తగూడెం విడిపోయి నూతన జిల్లాగా ఏర్పడింది. బొగ్గు ఖనిజ సంపదకు జిల్లా ప్రసిద్ధి చెందింది.