హాకీ అండర్ 19 క్రీడాకారుల ఎంపిక

హాకీ అండర్ 19 క్రీడాకారుల ఎంపిక

నిజామాబాద్: ఆర్మూర్ పట్టణం మినీ స్టేడియంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల SGF అండర్ 19 బాలురు, బాలికలకు హాకీ జట్టు ఎంపిక పోటీలు నిర్వహించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 18 మంది క్రీడాకారులను తుది జట్టుకు ఎంపిక చేయడం జరిగిందని జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమణ తెలిపారు. ఈ నెలాఖరులో నల్గొండ జిల్లాలో జరగబోయే రాష్ట్రస్థాయి టోర్నమెంట్‌లో పాల్గొంటారని తెలిపారు.