యురియా కోసం రైతుల క్యూ లైన్

KMR: పాల్వంచ మండలం భవానిపేట గ్రామంలో బుధవారం యూరియా కోసం రైతులు క్యూలైన్లలో నిలబడ్డారు. ఎరువుల దుకాణంలో ఒక్కో రైతుకు కేవలం ఒక సంచి మాత్రమే ఇస్తుండటంతో పంటలకు సరిపడా యూరియా అందడం లేదని రైతులు వాపోయారు. దీంతో ప్రతిసారీ యూరియా కోసం క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.