బార్‌ల నిర్వహణకు లాటరీ తీసిన విశాఖ JC

బార్‌ల నిర్వహణకు లాటరీ తీసిన విశాఖ JC

విశాఖలో బార్ల నిర్వహణకు లక్కీ‌డ్రా నిర్వహించారు. 52 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేయగా 108 దరఖాస్తులు వచ్చాయి. 27 మద్యం బార్లకు మాత్రమే 4 చొప్పున దరఖాస్తులు రావడంతో ఇవాళ ఉదయం VMRDA చిల్డ్రన్స్ ఎరీనాలో జేసీ విద్యాదరి, ఎక్సైజ్ డీసీ శ్రీరామచంద్రమూర్తి లాటరీ తీశారు. ఇప్పటికే లాటరీ ద్వారా బార్‌లు కేటాయించిన పలువురికి ధ్రువపత్రాలను కూడా అందజేశారు.