వృద్ధాప్య పింఛను కోసం 75 ఏళ్ల మహిళ వేదన
TPT: పాకాల మండలం చిన్నగోర్పాడు పంచాయతీకి చెందిన జీ.నీలమ్మ (75)కి వృద్ధాప్య పెన్షన్ గత సంవత్సరం రోజులుగా రావడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ తొలగించారు. ఇంత వరకు తిరిగి మంజూరు కాలేదు. అధికారులు సంవత్సరం పాటు కాలయాపన చేస్తున్నారని ఆమె వాపోయారు. ప్రస్తుతం ఆమెకు తెల్ల రేషన్ కార్డు ఉంది. త్వరగా పింఛను మంజూరు చేయాలని ఆమె కోరారు.