సిరిసిల్ల చేనేత కళాకారుడు మరో అద్భుత సృష్టి
SRCL: సిరిసిల్ల పట్టణానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ మరో అద్భుతం సృష్టించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామికి ప్రత్యేకించి అగ్గిపెట్టెలో ఇమిడి రెండు గ్రాముల బంగారు చీరను మంగళవారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవో వెంకటస్వామికి అందించారు. దీని పొడవు 5:30 మీటర్లు వెడల్పు 48 ఇంచులు దీనిని తయారు చేయుటకు వారం రోజుల వ్యవధి పట్టిందన్నారు.