భీమిలి బీచ్ కోత నివారణకు నిధులు

VSP: భీమిలి బీచ్ కోత నివారణకు రూ.210 కోట్లు, తాగునీటి ప్రాజెక్టుకు రూ.595 కోట్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్‌కు రూ.292 కోట్లు ఖర్చు చేస్తామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం MVP కాలని ఆయన నివాసంలో మాట్లాడుతూ... మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.100 కోట్లు వినియోగిస్తున్నట్లు చెప్పారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు రోడ్ల విస్తరణ పూర్తి చేస్తామన్నారు.