కెమికల్ ట్యాంకర్‌ పేలి వ్యక్తి మృతి

కెమికల్ ట్యాంకర్‌ పేలి వ్యక్తి మృతి

SRD: మునిపల్లి మండలం బుదేరా వద్ద కెమికల్ ట్యాంకర్‌ పేలింది. బుదేరాలోని రసాయన పరిశ్రమల్లో కెమికల్ ఖాళీ చేసి వెల్డింగ్ చేస్తుండగా ట్యాంకర్ ఒక్కసారిగా పేలింది. ప్రమాదంలో వెల్డింగ్ పనులు చేస్తున్న ఫరీద్(32) మృతి చెందాడు. సమీపంలోని వాహనాల అద్దాలు ధ్వంసం అయ్యాయి. వెల్డింగ్ పనులు చేస్తున్నప్పుడు టాంకర్‌పై మూతలు తెరవకపోవడంతో గ్యాస్ పేరుకుపోయి పేలుడు జరిగినట్లు తెలుస్తోంది.