రైతులకు సస్యరక్షణపై అవగాహన

పెద్దపల్లి జిల్లా నర్సాపూర్‌లో శాస్త్రవేత్త సతీష్ చంద్ర వరి పంటలో సస్యరక్షణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కాండం తొలుచు పురుగుల నివారణకు 25 మందికి లింగాకర్షక బుట్టలు, వేప నూనె పంపిణీ చేశారు. పురుగులు కనిపించిన వెంటనే పిచికారీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఉమాపతి, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.