రేపే 48 గంటల ‘జల సమర దీక్ష': శ్రీహర్ష

రేపే 48 గంటల ‘జల సమర దీక్ష': శ్రీహర్ష

కర్నూలు: గుండ్రేవుల జలాశయం సాధన కోసం కర్నూలు ప్రగతి సమితి అధ్యక్షుడు ఎం. శ్రీహర్ష సోమవారం నుంచి 48 గంటల ‘జల సమర దీక్ష’ చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఉదయం 9:30కి రాజ్ విహార్ సెంటర్ పాత బస్ డిపో నుంచి ధర్నా చౌక్ వరకు రైతులు, యువత, విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి, అక్కడే 48 గంటల దీక్ష ప్రారంభించనున్నారు.