VIDEO: కలియుగ ప్రత్యక్ష దైవానికి విశేష పూజలు

NDL: రుద్రవరం మండల పరిధిలో వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం వాసాపురం శ్రీ అలివేలు మంగా సమేత లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి అర్చకులు విశేష పూజలను నిర్వహించారు. శనివారం స్వామి అమ్మవారికి పంచామృత అభిషేకాలు అర్చనలు నిర్వహించారు. ప్రత్యేక అలంకారాలతో భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులకు సామూహిక కుంకుమార్చన పూజలను నిర్వహించారు.