VIDEO: నరసింహ స్వామిని దర్శించుకున్నఅడిషనల్ డిస్ట్రిక్ జడ్జి
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని జగిత్యాల జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ జడ్జి సునీత కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన జడ్జికి దేవస్థానం సాంప్రదాయ ప్రకారం స్వాగతం పలికారు. స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శ్రీనివాస్ స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి ప్రసాదం అందజేశారు.