నల్గొండలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

నల్గొండలో పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

NLG: జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. జిల్లావ్యాప్తంగా 106 కేంద్రాలలో మొత్తం 19,698 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 10,147 మంది బాలురు, 9,551 మంది బాలికలు ఉన్నారు. పరీక్షలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం హెల్ప్ లైన్ నంబర్ 9121212504 అందుబాటులో ఉంది.