తొర్రూరులో అరైవ్-అలైవ్ కార్యక్రమం
MHBD: తొర్రూరులో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అరైవ్-అలైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తూనం శ్రవణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు. ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగించడం, వేగ పరిమితులు పాటించడం వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు.