పది పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు
MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని తహసీల్దార్ రజనీకుమారి సందర్శించారు. పరీక్ష కేంద్రంలో విద్యార్థులకు అందుతున్న సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా అన్ని రకాల మౌలిక వసతులు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో షాజీలోద్దీన్ పాల్గొన్నారు.