ఇసుక లారీ బోల్తా.. డ్రైవర్, క్లీనర్‌కు గాయాలు
NDL: కొలిమిగుండ్ల గ్రామ సమీపంలోని గ్యాస్ గోడౌన్ వద్ద ఇవాళ ఇసుక లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌కు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స కోసం అవుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నడిరోడ్డుపై లారీ బోల్తా పడటంతో రోడ్డుకి ఇరువైపుల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారు.