నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

KKD: సామర్లకోట విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో వివిధ ఫీడర్ల వార్షిక మరమ్మతుల దృష్ట్యా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ ప్రభాకర్ తెలిపారు. ఈ కారణంగా రిలయన్స్, సామర్లకోట ఇండస్ట్రీయల్ ఎస్టేట్ తదితర ప్రాంతాలలో విద్యుత్ సరఫరా ఉండదని విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఈఈ ప్రభాకర్ కోరారు.