మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎంఈవో

KRNL: నందవరం మండలం కనకవీడు జడ్పీ పాఠశాలలో గురువారం మధ్యాహ్న భోజనాన్ని ఎంఈవో రఘునాథ్ తనిఖీ చేశారు. భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ప్రతిరోజూ మెనూ ప్రకారం భోజనం పెట్టాలని ఏజెన్సీ వారికి సూచించారు. విద్యార్థులకు సకాలంలో భోజనం పెట్టకపోయినా, మెనూ పాటించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను ఉపాధ్యాయులు తప్పకుండా పర్యవేక్షించాలని సూచించారు.