రాష్ట్ర స్థాయి రగ్బీ పోటీలకు కొండపాక విద్యార్థులు
SDPT: సూర్యాపేట జిల్లాలో ఈ నెల 3 నుంచి 5 వరకు నిర్వహించే రాష్ట్ర స్థాయి సీనియర్ రగ్బీ పోటీలకు కొండపాక తెలంగాణ మోడల్ స్కూల్ విద్యార్థులు ఎంపికయ్యారు. పాఠశాలకు చెందిన శ్రీరామ్ బాలు, సతీష్, యశ్వంత్, లక్ష్మణ్ సూర్యాపేటలోని ఎమ్మెస్కే ప్రసాద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థుల ఎంపికపై ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.